విరాట్ కోహ్లీ..(Virat Kohli) క్రికెట్ (Cricket Updates) ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ లో పరుగుల రారాజుగా పేరు సంపాదించాడు. క్రీజులో కుదురుకుంటే ఏ స్టార్ బౌలర్ కైనా చుక్కలే. రికార్డుల కోసం విరాట్ కోహ్లీ వెంటాపడటం కాదు.. ఆ రికార్డులే విరాట్ కోహ్లీ వెంట పడతాయ్ అనేంతగా క్రికెట్ లో చరిత్ర సృష్టించిన మొనగాడు. కానీ, ఇప్పుడు అదంతా గతంగా మారింది.
ఓ వైపు కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శిస్తున్న కోహ్లీ.. బ్యాటర్‌గా మాత్రం తేలిపోతున్నాడు. టెస్ట్ క్రికెట్లో గత ఏడాది 10 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. మొత్తం 11 మ్యాచ్‌ల్లో 28.21 సగటుతో 536 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ఏడాది మూడు వన్డేలు మాత్రమే ఆడిన కోహ్లీ 43 సగటుతో 129 రన్స్ చేశాడు. 8 టీ20ల్లో 37.7 సగటుతో 299 రన్స్ చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌నే తీసుకుంటే.. ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26-30)లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (35, 18) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించి కోహ్లీపై ఒత్తిడి లేకుండా చేసినా.. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.