Happy Birthday Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఫొటోలు... బర్త్‌డే స్పెషల్

#KingKohli : దూకుడైన ఆటతీరుతో... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... 31వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. నెటిజన్లు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఫలితంగా ట్విట్టర్ టాప్ ట్రెండ్, సెకండ్ టాప్ ట్రెండ్... రెండూ విరాట్ కోహ్లీతోనే నిండిపోయాయి. #HappyBirthdayViratKohli పేరుతో టాప్ ట్రెండ్ నడుస్తోంది. దీనికి 3.25లక్షలకు పైగా ట్వీట్లున్నాయి. #KingKohli పేరుతో సెకండ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే 31 వేల ట్వీట్లు ఉన్నాయి... అంతకంతకూ ఇవి పెరుగుతున్నాయి. ఎప్పుడూ బర్త్ డే టైమ్‌లో ఫ్యామిలీకి దూరంగా ఉండే రికార్డుల కింగ్... గతేడాది, ఈసారి మాత్రం... కుటుంబంతోనే పుట్టిన రోజు జరుపుకుంటుండటం విశేషం. ఈ సందర్భంగా... ఆయన అరుదైన ఫొటోలను చూద్దాం.