ఐపీఎల్(IPL).. ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లీగ్స్ లో ఐపీఎల్ కున్నా క్రేజే సపరేటు. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ (BCCI)కి కూడా కాసుల పంట పండుతూనే ఉంది. ప్రతి ఏటా ఐపీఎల్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన లీగ్.. వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది.
ఆ విషయాలు ఇప్పటికీ తనకి బాగా గుర్తున్నాయని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ. " 2008 సీజన్ తర్వాత నాకోసం ఎయిర్పోర్ట్కి ఓ ఓమ్నీ కారును పంపారు. నేను అప్పటికీ కేవలం అండర్-19 ప్లేయర్గా మాత్రమే ఉన్నా. మిగిలిన వారికోసం ఏసీ కార్లు పంపారు. నాకు మాత్రం ఓ డొక్కు ఓమ్నీ పంపించారు. వాడికి ఏదో ఒకటి పంపి, ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావాలని వాళ్లు అనుకుని ఉండొచ్చు.