ఎంత భార్య అయితే మాత్రం జండూ బామ్ సినిమాను బాగుందంటూ మెచ్చుకోవడం సరికాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇంతకు ముందు అనుష్క వర్మ నటించి, నిర్మించిన ‘పారి’ సినిమాను ఇలా ఆకాశానికి ఎత్తేశాడు విరాట్ కోహ్లీ ( Virat kohli / Twitter )
దాంతో టీమిండియా కెప్టెన్ సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదు... అలాంటిది ఎందుకిలా చెత్త సినిమాలను బాగుందంటూ పోస్ట్‌లు చేయడమంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇంకొందరు మాత్రం ‘జీరో’ సినిమా కలెక్షన్లు ఘోరంగా వస్తున్నాయనే ఉద్దేశంతోనే... భార్య సినిమాకు వసూళ్లు పెంచేందుకు కోహ్లీ ఇలా ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ( Virat Kohli / BCCI / twitter )
బాలీవుడ్ ‘కింగ్ ఖాన్’ షారుఖ్ హీరోగా అనుష్క శర్మ, కత్రీనా కైఫ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘జీరో’ డిసెంబర్ 21న విడుదలైన సంగతి తెలిసిందే.( Virat kohli / Twitter )
‘జీరో’ సినిమాలో షారుక్ ఖాన్ ఓ మరుగుజ్జు పాత్రలో నటించగా... అనుష్క శర్మ వీల్ ఛైర్‌కి మాత్రమే పరిమితమైన సైంటిస్ట్‌గా నటించింది..
ఇంతకుముందు ‘రంజానా’, ‘తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన ఆనంద్ ఎల్ రాయ్... ‘జీరో’ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అనుకున్న కథను చక్కగా తెరకెక్కించడంలో ఆనంద్ ఎల్ రాయ్ బొక్కబోర్లా పడ్డాడని సినీ విమర్శకులు... సినిమాను బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.
అన్ని వర్గాల నుంచి ‘జీరో’కి నెగిటివ్ రివ్యూలు వస్తున్న సమయంలో కోహ్లీ... సినిమాను, తన భార్యను పొగుడుతూ పోస్ట్ చేయడంతో విరాట్ ట్రోలింగ్‌కు దొరికాడు.