VIRAT KOHLI LATEST NEWS TEAM INDIA FORMER SKIPPER VIRAT KOHLIS BRAND VALUE SINK MORE THAN 50 MILLIONS COMPARE TO LAST YEAR SJN
Virat Kohli: భారీగా పడిపోయిన విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ... అయినా నంబర్ 1 స్థానంలోనే..
virat kohli: గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీమిండియా (Team India) ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి కాలం అస్సలు కలిసి రావడం లేదు. తొలుత అతడే స్వయంగా భారత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా... ఆ తర్వాత బీసీసీఐ అతడి నుంచి వన్డే కెప్టెన్సీని లాగేసుకుంది. ఇక సౌతాఫ్రికాలో అటు ఆటతో ఇటు కెప్టెన్ గా విఫలమై టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు.
[caption id="attachment_1240406" align="alignnone" width="1600"] అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేసి కోహ్లీ రెండేళ్లు పైనే అవుతోంది. అడపా దడపా అర్ధ సెంచరీలు చేస్తున్నా... అది కోహ్లీ స్థాయి ఆటతీరు కాదంటూ అతడి ఫ్యాన్స్ నుంచే కామెంట్స్ వస్తున్నాయి.
[/caption]
2/ 6
కెప్టెన్సీ కోల్పోవడం విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూపై పడింది. 2020లో 238 మిలియన్ డాలర్లుగా ఉన్న అతడి బ్రాండ్ వ్యాల్యూ... 2021 నాటికి దాదాపు 52 మిలియన్ డాలర్ల మేర పడిపోయింది. డఫ్ అండ్ ఫెల్ప్స్ ప్రకటించిన సెలబ్రిటీల బ్రాండ్ వ్యాల్యూలో కోహ్లీ బ్రాండ్ విలువ 186 మిలియన్ డాలర్లకు తగ్గింది.
3/ 6
ఇంత తగ్గినా కూడా భారత్ నుంచి టాప్ మోస్ట్ సెలబ్రిటీగా విరాట్ కోహ్లీనే కొనసాగుతున్నాడు. 2021కి కూడా అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన భారత సెలబ్రిటీలా జాబితాలో విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు.
4/ 6
రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఉన్నాడు. అతడి బ్రాండ్ విలువ 158 మిలియన్ డాలర్లుగా ఉంది. 140 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించిన నాలుగో స్థానంలో నిలిచింది.
5/ 6
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ బ్రాండ్ వ్యాల్యూ మాత్రం పెరిగింది. 2020లో అతడి బ్రాండ్ వ్యాల్యూ దాదాపు 36 మిలియన్ డాలర్లుగా ఉండగా... ఇప్పుడు అది 61 మిలియన్ డాలర్లకు పెరిగింది. ధోని ఐదో స్థానంలో ఉన్నాడు.
6/ 6
ఇక బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలిసారిగా టాప్ 20లో చోటు దక్కించుకుంది. గతేడాది జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో మెరిసిన ఆమె... ఇటీవల స్పిస్ ఓపెన్ లో చాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె బ్రాండ్ విలువ 22 మిలియన్ డాలర్లు.