2019 నుంచి కోహ్లీ ఒక సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో మాజీలు ఆడేసుకుంటున్నారు. రన్‌మిషన్ పనైపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా తీవ్రనిరాశకు గురయ్యారు. కానీ, మాజీ క్రికెటర్లు.. అపోజిట్ ఫ్యాన్స్ కోహ్లీని విమర్శిస్తున్నా.. అతని అభిమానులు మాత్రం దేవుడిలా ఆరాధిస్తున్నారు.
సోషల్ మీడియాలో కోహ్లీ తరచూ యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. కోహ్లీకి టీమిండియాలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇక మొన్నమొన్నటి దాకా టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. గత ఏడాది యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వైఫల్యం తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తొలుత వైదొలిగిన కోహ్లీ ఆ తర్వాత వన్డేలకు, టెస్టులకు కూడా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. మరోవైపు.. కోహ్లీ వైఫల్యం ఇంటా బయటా విమర్శలు వస్తూనే ఉన్నాయ్.