విరహవేదనలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... వీళ్ల రొమాన్స్ మామూలుగా లేదుగా...
ICC World Cup 2019: ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ కు భార్య బెంగ పట్టుకుంది. వరల్డ్ కప్ టోర్నీ సీజన్లో మొదటి 20 రోజులు పూర్తి అయితే కానీ భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను కలవడానికి వీలులేదని, బీసీసీఐ హుకూం జారీ చేసింది. దీంతో పాకిస్థాన్ తో మ్యాచ్ ముగిసే వరకూ టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబాలకు దూరంగా గడిపారు. అయితే పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిపోయింది. దీంతో టీమిండియా ప్లేయర్ల కుటుంబాలు లండన్ లో వాలిపోయాయి. అయితే టీమిండియా కెప్టెన్, బాలివుడ్ భామ అనుష్క శర్మ దంపతులు మాత్రం తమకు దొరికిన కాస్త సమయంలో ప్రేమలో మునిగితేలుతున్నారు.