Virat Kohli - Anushka Sharma : ఇంగ్లండ్ లో విరుష్క జోడి ఆఫ్ ఫీల్డ్ మూమెంట్స్..వైరల్ పిక్స్..

Virat Kohli - Anushka Sharma : టీమిండియా (Team India) క్రికెటర్లు అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకొని వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా అనుమతి ఇచ్చింది. ఇక, WTC Final తర్వాత..ఇంగ్లండ్ సిరీస్ కు బోలెడంత గ్యాప్ వచ్చింది. ఇంగ్లండ్ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు రీఫ్రెష్ అయ్యేందుకు సరియైన సమయం దొరకడంతో..అల ఇంగ్లండ్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ ఫ్యామిలీస్ తో సరాదాగా గడుపుతున్నారు. ఇంగ్లండ్‌ వీధుల్లో విహరిస్తూ మధుర జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించుకుంటున్నారు. ఈ క్రమంలో విరుష్క జోడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయ్.