VIRAT KOHLI 100TH TEST DURING FELICITATION CEREMONY ANUSHKA SHARMA KOHLI CUTE MOVES GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Virat Kohli 100th Test : కోహ్లీకి అనుష్క అంటే ఎంత ప్రేమ.. స్పెషల్ డే రోజున విరాట్ ఏం చేశాడో తెలుసా..?
Virat Kohli 100th Test : మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే మైదానం మొత్తంలో విరాట్ కోహ్లీ నినాదాలు వినిపించాయి. 100వ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలు చెబుతూ మైదానంలో అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించారు.
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలు రాయిని చేరుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీకి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పెషల్ మెమెంటోను అందించాడు.
2/ 8
ఆ స్పెషల్ మెమెంటోతో పాటు కోహ్లీకి 100వ టెస్టు మ్యాచ్ క్యాప్‌ను అందించాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా పాల్గొంది.
3/ 8
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే మైదానం మొత్తంలో విరాట్ కోహ్లీ నినాదాలు వినిపించాయి. 100వ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలు చెబుతూ మైదానంలో అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించారు.
4/ 8
ఈ స్పెషల్ డే రోజున విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. విరాట్ కోహ్లీని సత్కరించే సమయంలో అనుష్క శర్మ పక్కనే ఉండటం క్యూట్ మూమెంట్ గా చెప్పుకోవచ్చు.
5/ 8
క్యాప్ అందుకున్న తర్వాత కోచ్‌తో పాటు ఆటగాళ్లందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.
6/ 8
ఆ తర్వాత అనుష్కను కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
7/ 8
కోహ్లీ మైల్ స్టోన్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. క్రేజీ క్రేజీ ప్లకార్డులను ప్రదర్శించారు.
8/ 8
క్యాప్ తీసుకున్న తర్వాత కోహ్లీ అనుష్కను కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నాడు. దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీకి అనుష్క అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.