Vijay Hazare Trophy 2022 : ఈ క్రమంలో కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే.
టి20 ప్రపంచకప్ (T20 World Cup ) 2022 అటు ముగియగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేడి ఆరంభం కానుంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరి వారం నుంచి మే ఆఖరి వారం వరకు ఐపీఎల్ 2023 సీజన్ జరగనుంది.
2/ 7
ఈ క్రమంలో కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తమకు నచ్చని ప్లేయర్లను రిలీజ్ చేసేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజీలకు నవంబర్ 15 వరకు అవకాశం ఇచ్చింది.
3/ 7
సరిగ్గా ఈ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ బిల్డప్ బాబాయ్ రియాన్ పరాగ్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ మోత మోగించాడు.
4/ 7
అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్.. రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 84 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో అస్సాం జట్టు 143 పరుగుల భారీ స్కోరుతో గెలుపొందింది.
5/ 7
తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం 46.5 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ 128 పరుగులకే ఆలౌటైంది. దత్తా, అవినోవ్ చౌదరి చెరో మూడు వికెట్లు తీశారు.
6/ 7
ఇక రియాన్ పరాగ్ కు లిస్ట్ ‘ఎ’ క్రికెట్ లో ఇదే తొలి శతకం. 2019 నుంచి రియాన్ పరాగ్ ఐపీఎల్ ఆడుతున్నాడు. 2022లో జరిగిన మెగా వేలంలో రాజస్తాన్ అతడిని రూ. 3.80 కోట్లకు కొనుగోలు చేసింది. భవిష్యత్తులో టీమిండియా ఫినిషర్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.
7/ 7
రూ. 3.8 కోట్ల ప్లేయర్.. కేవలం 132 పరుగులు అంటే అతడిని టీంలో ఉంచుకోవడం కంటే కూడా రిలీజ్ చేయడం బెటర్ అని ఎవరికైనా అనిపిస్తుంది. మరి పరాగ్ ను రాజస్తాన్ రిలీజ్ చేస్తుందా.. లేక సెంచరీ చేశాడనే ఉద్దేశంతో జట్టుతోనే ఉంచుకుంటుందా అని తేలాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.