Vijay Hazare Trophy : హరియాణాతో జరిగిన పోరులో నారాయణ్ జగదీశన్ సెంచరీతో కదం తొక్కాడు కేవలం 123 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో జగదీశన్ కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
ప్రస్తుతం దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే వన్డే ట్రోఫీ (Vijay Hazare ODI Trophy) జరుగుతుంది. ఇందులో యువ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణ్ జగదీశన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు.
2/ 7
హరియాణాతో జరిగిన పోరులో నారాయణ్ జగదీశన్ సెంచరీతో కదం తొక్కాడు కేవలం 123 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో జగదీశన్ కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
3/ 7
దాంతో ఈ తమిళనాడు బ్యాటర్ అరుదైన రికార్డును అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ ఒకే ఎడిషన్ లో నాలుగు సెంచరీలు చేసి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
4/ 7
2008-09 సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా కూడా నారాయణ్ నిలిచాడు.
5/ 7
ఒక సీజన్ లో నాలుగు సెంచరీలు చేసిన జాబితాలో జగదీశన్, కోహ్లీలతో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ రసవత్తరంగా సాగుతుంది.
6/ 7
ఇక మరోవైపు టీమిండియా న్యూజిలాండ్ తో రెండో టి20కి సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మౌంట్ మాంగన్యూయ్ వేదికగా జరగనుంది. తొలి టి20 వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే.
7/ 7
ఇక రెండో టి20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మ్యాచ్ జరగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం గం. 12లకు ఆరంభం కావాల్సి ఉంది.