చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్.. మహారాష్ట్ర (Maharashtra) ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మరోసారి శతకంతో మెరిశాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2022లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న ఫైనల్ లో కూడా శతకం (131 బంతుల్లో 108, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు.
ఇక విజయ్ హజారే ట్రోఫీ అంటేనే రెచ్చిపోయే గైక్వాడ్.. ఈ ట్రోఫీలో గడిచిన 10 ఇన్నింగ్స్ లలో ఏకంగా 1,263 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. గత పది ఇన్నింగ్స్ లలో రుతురాజ్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 136, 154, 124, 21, 168, 124, 40, 220, 168, 108.. ఈ గణాంకాలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఈ పూణె కుర్రాడి జోరు ఎలా సాగుతుందో..
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో రుతురాజ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 12 సెంచరీలు సాధించాడు. అంకిత్ బవన్, రాబిన్ ఉతప్పలను అధిగమించి అత్యధిక సెంచరీల పరంగా తొలి ఆటగాడిగా నిలిచాడు.
రుతురాజ్ అదిరే సెంచరీతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అజీమ్ కాజీ 37 పరుగులు, సత్యజిత్ 27 పరుగులు చేశారు. సౌరాష్ట్ర నుంచి చిరాగ్ జానీ హ్యాట్రిక్‌తో అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు. ఇక, ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు రుతురాజ్.