విహారీకి పోరాటాలు కొత్తేం కాదు. గతంలోనూ తొడకండరాల గాయంతో బ్యాటింగ్ చేశాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో తొడకండరాలు పట్టేసినా బ్యాటింగ్ కు దిగిన విహారీ టీమిండియాను డ్రాతో గట్టెక్కించాడు. అయితే త్వరలో ఆసీస్ తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కోసం విహారీని సెలెక్టర్లు పట్టించుకోలేదు. (PC : TWITTER)