UNMUKHT CHAND TIES THE KNOT WITH NUTRITIONIST SIMRAN KHOSLA PHOTOS JNK
Unmukt Chand: ఇండియాలో క్రికెట్ వదిలేసి అమెరికా వెళ్లాడు.. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంటివాడైన ఉన్ముక్త్ చంద్
భారత మాజీ క్రికెట్ ఉన్ముక్త్ చంద్ 28 ఏళ్ల వయసులో ఇండియాలో క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఆడుతున్నాడు. తాజాగా డైటీషియన్ సిమ్రన్ను వివాహం చేసుకున్నాడు.
తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన ఉన్ముక్త్ చంద్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యాడు. అతను డైటీషియన్ అయిన సిమ్రాన్ ఖోస్లాతో కలిసి ఏడడుగులు వేశాడు . (Twitter)
2/ 6
తన పెళ్లి ఫొటోలను ఉన్ముక్త్ చంద్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ రోజు మేమిద్దరం ఎప్పటికీ కలసి ఉండాలని నిర్ణయించుకున్నాము అని పోస్టు చేశాడు. (Twitter)
3/ 6
ఉన్ముక్త్ కొంతకాలం క్రితం భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్ ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఆడుతున్నాడు. (pc: UnmuktChand twitter)
4/ 6
గత ఏడాది అన్ని ఫ్రాంచైజీలు ఉన్ముక్త్ చంద్‌ను విస్మరించాయి. అతడిని తీసుకోవడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. దీంతో అతడిని ఎందుకు తీసుకోలేదంటూ సిమ్రన్ సోషల్ మీడియాలో ప్రశ్నించింది. (pc: UnmuktChand twitter)
5/ 6
సిమ్రన్ పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ట్యాగ్ చేసి.. అతడిలో ఎంతో టాలెంట్ ఉందని.. అయినా ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించింది.
6/ 6
ఉన్ముక్త్ చంద్‌కు ఇక్కడ అవకాశాలు రాకపోవడంతోనే ఇండియాలో అన్ని రకాలా ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. (pc: UnmuktChand twitter)