'ప్రస్తుత భారత జట్టులో నా మాదిరి బ్యాటింగ్ చేసే బ్యాటర్ లేడు. కాకపోతే రిషభ్ పంత్, పృథ్వీ షాల బ్యాటింగ్ శైలి కొంచెం నా బ్యాటింగ్‌తో సరిపోల్చవ్చు. టెస్టు క్రికెట్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్ తీరు.. దూకుడుగా ఆడే స్వభావం కాస్త నా ఆటను పోలి ఉంటుంది. కానీ అతను 90, 100 పరుగులతోనే సంతృప్తి పడతాడు. నేను మాత్రం అలా కాదు. బరిలోకి దిగితే డబుల్ సెంచరీ, 250, 300 బాదాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతా. రిషభ్ పంత్ కూడా నాలాగే ఆలోచిస్తే అభిమానులను మరింత అలరించినవాడవుతాడని సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. (Image credit ESPN cricinfo)
'చిన్న వయసులో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ బాగా ఆడేవాడిని. అప్పుడు నేను ఎక్కువగా బౌండరీలు బాదడానికే ఇష్టపడేవాడిని. అదే అలవాటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా కొనసాగింది. సెంచరీ వేయడానికి ఎన్ని బౌండరీలు కావాలో అని లెక్కలు వేసుకునే వాడిని. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు 10 సింగిల్స్ తీయడం కంటే.. రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదితే సరిపోతుందని ఆలోచించేవాడిని' అని తన మనసులో మాటను బయటపెట్టాడు సెహ్వాగ్. (Image credit ESPN cricinfo)
అప్పుడు నేను ఎవరూ 295 కూడా కొట్టలేదు కదా? అని బదులిచ్చాను. ఆ మరుసటి బంతికే సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాను. నా ట్రిపుల్ సెంచరీని నా కన్నా సచిన్ ఎక్కువగా సంతోషించాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సచిన్- సెహ్వాగ్ స్నేహ బంధం గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. (Image credit ESPN cricinfo)