ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది. (PIC: AP)
గేమ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ ప్లేయర్ టిముర్ ఒరుజ్ గోల్ సాధించి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత భారత్ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ జర్మనీ మరో గోల్ నమోదు చేయలేకపోయింది. చివరి నిమిషంలో ఆ జట్టుకు వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ వాటిని భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక రెండో క్వార్టర్లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో సిమ్రన్‌జిత్ గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచాడు. (Photo Credit : AP)
ఆ వెంటనే గుర్జంత్ సింగ్ ఇచ్చిన పాస్‌ను సిమ్రన్ జిత్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 5-3తో డబుల్ అయింది. ఆ తర్వాత భారత్‌కు పలు అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.చివరి క్వార్టర్లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే భారత రక్షణ శ్రేణి తప్పిదంతో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకుంది. లుకాస్ విండ్ ఫెడర్ కొట్టిన గోల్‌ను కీపర్ శ్రీజేష్ అంచనా వేయలేక విఫలమయ్యాడు. దాంతో భారత ఆధిక్యం 5-4కు తగ్గింది. ఆ తర్వాత మరింత జోరు కనబర్చిన భారత్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. జర్మనీ కొట్టిన గోల్స్‌ను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్ లో శ్రీజేషే అసలు హీరో. 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనంగా.. జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ భారత డిఫెన్స్ విభాగం అడ్డుకోవడంతో విజయం లాంఛనమైంది.(PIC: AP)