షార్ప్ కట్స్.. అక్యూరసీ షాట్స్.. బుల్లెట్లా దూసుకెళ్లే స్మాష్లు.. ఎదురులేని స్ట్రోక్లు.. ఇలా షటిల్పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్రౌండ్ విన్యాసం సింధూది. అదే ఇప్పుడు.. సింధూకి కలిసొచ్చింది. కోట్లాది మంది ఆశల్ని నిజం చేసింది తెలుగు తేజం. ఇక అంతకు ముందు, ఊహించని విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బంగారు పతకాన్ని ముద్దాడే బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. చివరికి కాంస్య పతక పోరులో గెలిచి చరిత్ర సృష్టించింది.