పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్ రీప్ ఛెజ్ విభాగంలో భారత రోయర్లు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నిజానికి- ఎవరూ ఊహించని కేటగిరీ ఇది. దీనికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఈ ఘనతను సాధించింది. అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఆర్మీ సోల్జర్స్ . జపాన్ సీ ఫారెస్ట్ వాటర్ వేలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎవరూ ఊహించని విధంగా విజయ పతాకాన్ని ఎగురవేసింది ఈ జోడీ. పోలెండ్‌కు చెందిన జెర్జీ కోవాల్స్కీ, అర్థర్ మికోలాజ్చెవ్స్కీ జోడీ తొలి స్థానంలో నిలిచింది. స్పెయిన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. (AFP Photo)
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. టోక్యో ఒలింపిక్స్ 2021లో దూసుకుపోతోంది. కాస్త కష్టపడినా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్లో ఆమె మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్లో 20వ సీడ్, ఉక్రెయిన్ ప్లేయర్ మార్గారిటా పెసోట్స్కాపై 4-3 తేడాతో విజయం సాధించింది. 7 గేమ్స్‌లకు గానూ నాలుగు గేమ్స్‌లో ప్రత్యర్థిపై మణిక పైచేయి సాధించింది. దీంతో ఆమె ప్రీక్వార్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సోఫియా పోల్కనోవాతో మనికా తలపడనుంది. (AP Photo)
టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొన్న భారత ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంచనాలను అందుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ప్రణతి పూర్తిగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పోటీలో నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు మాత్రమే చేసింది. దీంతో 29వ స్థానంలో నిలిచి.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీల ఆల్ రౌండ్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. టాప్ 24 జిమ్నాస్ట్‌లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించారు. (AFP Photo)
భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ (Mary Kom) టోక్యో ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ విజయంతో తన ఖాతా తెరిచింది.మహిళల 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ రౌండ్ ఆఫ్ 32లో విజయం సాధించింది. ఆదివారం జరిగిన బౌట్ లో డొమినికాకు చెందిన హెర్నాండెజ్ గార్సియా మిగులినాపై 4-1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది.