కరోనా నేపథ్యంలో వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2020 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి దాదాపు 10 వేల మంది అథ్లెట్లు ఈ క్రీడలకు అర్హత సాధించారు. ఇండియా నుంచి 115 మంది 17 క్రీడా కేటగిరీల్లో పోటీ పడనున్నారు. జూన్ 30న ముగిసిన అర్హత పోటీలలో వీరిని ఎంపిక చేసినట్లు ఆయా క్రీడా ఫెడరేషన్లు ప్రకటించాయి. ఒకటి రెండు వారాల్లోనే ఈ 115 మంది అథ్లెట్లతో పాటు కోచింగ్ సిబ్బంది, మ్యాచ్ అఫీషియల్స్, ఇతర సిబ్బంది టోక్యో ప్రయాణం కానున్నారు. (Twitter)
అథ్లెటిక్స్ :
పురుషుల జావెలిన్ త్రో - నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్
మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ - భావ్నా జాట్, ప్రియాంక గోస్వామి
పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ - ఇర్ఫాన్ థోడి, సందీప్ కుమార్, రాహుల్
4X400 మీటర్ల మిక్స్డ్ రిలే - ముహమ్మద్ అనాస్, వీకే విస్మయ, నిర్మల్ నోవా, జిస్నా మాథ్యూ
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ - అవినాశ్ సబ్లే
పురుషుల లాంగ్ జంప్ - ఎం. శ్రీశంకర్
మహిళల డిస్కస్ త్రో - కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా
పురుషుల డిస్కస్ త్రో - తేజీందర్ పాల్ సింగ్ తూర్
మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్ - ద్యుతీ చంద్
హాకీ
భారత పురుషుల జట్టు : మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), పీఆర్ శ్రీజేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, పురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంశీర్ సింగ్, దిల్ ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్
షూటింగ్ :
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ - అంజుమ్ ముద్గిల్, తేజశ్విని సావంత్
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - అపూర్వి చండేలా, ఎలవెనిల్ వాలారివా
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - మనూ భాకర్, యశస్విని దేశ్వాల్
మహిళల 25 మీటర్ల పిస్టల్ - మనూ భాకర్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - దివ్యాంన్ష్ పన్వార్, దీపక్ కుమార్
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ - సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - సౌరభ్ ఛౌదరి, అభిషేక్ వర్మ
పురుషుల స్కీట్ - అంగద్ వీర్ సింగ్ భజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్
మిక్స్డ్ టీమ్ ఈవెంట్లు
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - దివ్యాంన్ష్ సింగ్ పన్వార్ - ఎలవెనిల్ వాలారివా, దీపక్ కుమార్ - అంజుమ్ ముద్గిల్
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - సౌరభ్ చౌదరి-మను భాకర్, అభిషేక్ వర్మ-యశస్విని సింగ్ దేశ్వాల్
రెజ్లింగ్
పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ - రవి దహియా
పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ - భజరంగ్ పునియా
పురుఫుల 86 కేజీల ఫ్రీ స్టైల్ - దీపక్ పునియా
పురుషుల 125 కేజీల ఫ్రీ స్టైల్ - సుమిత్ మాలిక్
మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ - వినేష్ ఫొగట్
మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ - అన్షు మాలిక్
మహిళల 62 కేజీల ఫ్రీ స్టైల్ - సోనమ్ మాలిక్
మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ - సీమా బిస్లా