టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు విఫలం అవగా.. ఎలాంటి అంచనాలు లేని అథ్లెట్లు మాత్రం పతకాలు కొట్టేశారు. ముఖ్యంగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకం ఈ శతాబ్దానికే హైలైట్ అని చెప్పవచ్చు. భారత ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 7 పతకాలు గెలవడం ఇదే తొలిసారి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు (2 రజతం, 4 కాంస్యం) తర్వాత టోక్యో ఒలింపిక్స్ పతకాల సంఖ్యే ఎక్కువ. (SAI Media/Twitter)