ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో శనివారం తొలి కరోనా కేసు నమోదవ్వగా.. ఆదివారం మరో రెండు కొవిడ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అథ్లెట్లకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నాడు. కరోనా బారిన పడ్డ వారి సంఖ్య మొత్తానికి మూడుకు చేరింది.
కరోనా ఎఫెక్ట్ తో కఠిన నిబంధనల మధ్య ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.