ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడని విశ్వ క్రీడలు ఎట్టకేలకు మొదలు కాబోతున్నాయి. ఇక, ప్రతి అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించాలన్న కసితో టోక్యో అడుగుపెడుతున్నారు. ప్రతీ ఈవెంట్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పతకాల ఖరీదు ఎంత..?
ప్రతీ మెడల్ రాతి నుంచి చెక్కబడినట్లుగా అనిపిస్తుంది. అంత ధృఢంగా రూపొందించారు. అంతే కాకుండా పూర్తిగా పాలిష్ చేయబడి ఉండటంతో మెరుస్తూ ఉంటుంది. ప్రతీ మెడల్ ముందు భాగంలో గ్రీకు విజయ దేవత 'నైకి' బొమ్మ చెక్కబడింది. ఆమె ఏథెన్సులోని పనథినైకోస్ స్టేడియం ముందు నిలబడి ఉంటుంది. ఇక వెనుక భాగంలో టోక్యో 2020 లోగోను చెక్కారు.
ఏంది..556 గ్రాముల బంగారానికి కేవలం అంతేనా దక్కేది అనుకుంటున్నారా..? అయితే, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. గోల్డ్, సిల్వర్ మెడల్లో 550 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. కాకపోతే స్వర్ణ పతకం వెండితో రూపొందించి పైన 6 గ్రాముల బంగారు పూతను పూశారు. దీంతో గోల్డ్ మెడల్ వాల్యూ కేవలం 65 వేల 790 రూపాయల మాత్రమే.
కానీ, వాస్తవానికి అథ్లెట్లు గెలుచుకునే ఈ మెడల్స్‌కు విలువ కట్టడం అసాధ్యమే. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రదానం చేయడానికి 5 వేల గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తయారు చేశారు. ఇందులో ఉపయోగించిన లోహాలను 100 శాతం ఎలక్ట్రానిక్ చెత్త నుంచి వెలికి తీసినదే. ఇక, ఈ పతకాలు స్పెషల్ వుడ్ తో తయారు చేసిన బాక్స్ లో ఉంచి అథ్లెట్లకు ఇవ్వనున్నారు.