ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు పైన్ కెప్టెన్సీని రాజీనామా చేశాడు. పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న ప్రకటన చేసే సమయంలో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. పైన్ కంటే ముందు జట్టుకు నాయకత్వం వహించిన స్టీవ్ స్మిత్ కూడా కన్నీళ్లతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. (AFP)
2018 ఏడాదిలో స్టీవ్ స్మిత్ స్థానంలో టిమ్ పైన్ 46వ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. మీడియా నివేదికల ప్రకారం, 2017లో ఒక మహిళా సహోద్యోగికి అసభ్యకరమైన టెక్ట్స్ సందేశాలు, అనుచిత ఫోటోలను పంపినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అతడిపై విచారణ చేపట్టింది. పైన్, స్మిత్ ఇద్దరు కూడా తప్పుడు కారణాలతోనే జట్టు కెప్టెన్సీని వదిలేయడం గమనార్హం. (AFP)
మహిళా సహోద్యోగికి డర్టీ మెసేజ్‌లు పంపడంతో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని పైన్ నిర్ణయించుకున్నట్లు విలేకరులకు తెలియజేశాడు. బాల్ ట్యాంపరింగ్ కారణంగా 2018లో స్మిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో స్మిత్‌కు వ్యతిరేకంగా ఫ్యాన్స్ విమర్శలు చేశాడు. దీంతో విలేకరుల సమావేశానికి వచ్చిన స్మిత్ ఏడవడం మొదలుపెట్టాడు. (AFP)
ఇప్పుడు విలేకరుల సమావేశంలో పైన్ కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. 'నాలుగేళ్ల క్రితం నాటి కేసు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పటి సహోద్యోగితో అనేక సార్లు చాటింగ్ చేశాను. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటగ్రల్ యూనిట్ విచారణ జరింపింది. నేను నిర్దోషిగా విడుదలయ్యాను. అయితే ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్‌గా మారబోతోందని నేను ఇటీవల తెలుసుకున్నాను' అని పైన్ చెప్పాడు. కాగా పైన్ ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. (AP)
బాల్ ట్యాంపరింగ్ కేసు తర్వాత మీడియా ముందుకు వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కూడా ఇలాగే కనిపించాడు. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్‌కు స్మిత్ పూర్తి బాధ్యత వహించాడు. 'నేను దీనితో చాలా బాధగా మరియు నిరాశకు గురయ్యాను. నేనేం చేసినా జీవితాంతం పశ్చాత్తాపపడతాను' అని చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కూడా స్మిత్‌పై 1 సంవత్సరం నిషేధం విధించడమే కాకుండా అతడిని కెప్టెన్సీని కూడా తొలగించింది. స్మిత్ దక్షిణాఫ్రికా నుండి ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, అతను కేవలం 5 నిమిషాల విలేకరుల సమావేశంలో పదే పదే ఏడుస్తూనే ఉన్నాడు. (AFP)
టిమ్ పైన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ పూర్తిగా ప్రమాదంలో పడింది. టిమ్ పైన్ వైదొలగడంతో ఆస్ట్రేలియాకు కొన్నాళ్లు వైస్ కెప్టెన్‌గా పని చేసిన పాట్ కమిన్స్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నది. పాట్ కమిన్స్ కనుక దేశానికి 47వ టెస్ట్ కెప్టెన్ అయితే ఒక సంచలనమే. గత 65 ఏళ్లలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన మొదటి ఫాస్ట్ బౌలర్ అవుతాడు. (AFP)