ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఇండియా ఉమెన్స్ క్రికెట్లో మరో మైలురాయి వచ్చి చేరింది. మరో మెగా టోర్నీ ఐసీసీ ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్ ఎగరేసుకుపోవాలని హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది.
* రిచా ఘోష్ : కీపింగ్‌తో పాటు తన బ్యాటింగ్ విన్యాసంతో విధ్వంసకర ప్లేయర్‌గా రిచా ఘోష్ గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు 30 టీ-20 మ్యాచ్‌లు ఆడిన రిచా 134.27 స్ట్రైక్ రేట్‌తో 427 పరుగులు చేసింది. గత 13 ఇన్సింగ్స్లను పరిశీలిస్తే 164.03 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేసింది. ఇటీవల కాలంలో బ్యాట్‌తో చెలరేగిపోతున్న రిచా ఘోష్ 2023 ఐసీసీ ఉమెన్స్ టీ-20 క్రికెటర్ ఆఫ్ ది ప్లేయర్ రేసులో ముందు వరుసలో ఉంది.
* దీప్తి శర్మ : 25 ఏళ్ల ఈ భారత ప్లేయర్ బౌలింగ్‌తో పాటు బ్యాటుతోనూ రాణించడంతో ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందింది. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న దీప్తి శర్మ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు 85 టీ-20 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 6.14 ఎకానమీ రేటుతో 92 వికెట్లు పడగొట్టింది. గత మూడు నెలల్లో 16 మ్యాచ్‌ల్లో 5.89 ఎకానమీ రేటుతో 24 వికెట్లు పడగొట్టింది.
దీప్తి శర్మ బ్యాట్‌తోను అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటి వరకు 85 టీ-20 మ్యాచ్‌ల్లో 106.39 స్ట్రైక్ రేట్‌తో 898 పరుగులు చేసింది. గత మూడు నెలల రికార్డ్ పరిశీలిస్తే.. 16 మ్యాచ్‌ల్లో 148.25 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేసింది. దీంతో ఈ గణాంకాలను బట్టి చూస్తే 2023 ఐసీసీ ఉమెన్స్ టీ-20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఉన్న ప్లేయర్స్ జాబితాలో దీప్తి శర్మ ఉండే అవకాశం ఉంది.