చెన్నై సూపర్ కింగ్స్: ఈసారి సురేష్ రైనాను చెన్నై యాజమాన్యం వదులుకుంటుందనే ఊహాగానాలు వినిపించినా, అనూహ్యంగా అతడిని కొనసాగించారు. గత సీజన్లో ఆడిన కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ వంటి ప్లేయర్లను మేనేజ్మెంట్ వదులుకుంది. ట్రేడ్ ఇన్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఉత్తప్పను తీసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మిగిలిన టాప్-11 ఆటగాళ్లలో డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, తాహిర్ లేదా లుంగీ ఎన్గిడి ఉండవచ్చు. గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆటగాళ్లు ఉన్న టీమ్‌కు జాబితాలో నాలుగో ర్యాంక్ ఇవ్వవచ్చు.