టోక్యో ఒలింపిక్స్‌లో బేస్‌బాల్‌ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెడుతున్నారు. 1992లో ఇది మెడల్ ఈవెంట్ గానే ఉన్నా.. 2008లో దీన్ని తీసేశారు. కాగా, జపాన్‌లో బేస్‌బాల్ చాలా పాపులర్ ఆట. అక్కడ ప్రతీ ఏటా జరిగే నిప్పన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్ ప్రపంచంలో రెండో అతిపెద్దది. అందుకే ఈ సారి దీన్ని మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. ఆరు దేశాలు ఈ క్రీడలో పతకం కోసం పోటీ పడనున్నాయి. (PC: Olympic Channel)
టోక్యో ఒలింపిక్స్‌లో తొలి సారి అడుగు పెడుతున్న క్రీడ స్కేట్ బోర్డింగ్. మహిళలు, పురుషుల విభాగాల్లో వేర్వేరుగా రెండు విభాగాల్లో స్కేట్ బోర్డింగ్ నిర్వహించనున్నారు. పార్క్, స్ట్రీట్ రెండింటిలో పతకాలు అందించనున్నారు. పార్క్ విభాగం కోసం టోక్యోలోని సముద్ర తీరం వద్ద ప్రత్యేకంగా ఒకపార్క్ నిర్మించారు. (PC: Olympic Channel)
జపాన్‌లోని ఒకినావాలో 1868లో కరాటే పుట్టింది. అయితే 1900 తర్వాత ఈ ఆట చాలా ప్రాచూర్యం పొందింది. జపాన్ నుంచి ఆసియా దేశాల్లో ఈ ఆట వ్యాపించింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఈ ఆటకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ ఇది ఏనాడూ ఒలింపిక్స్ జాబితాలో లేదు. అయితే ఈ సారి ఒలింపిక్స్ జపాన్‌లో జరుగుతున్నందున తొలి సారి కరాటేకు స్థానం కల్పించారు. 2024నుంచి ఈ ఆట ఒలింపిక్స్‌లో ఉండదు. (PC: Olympic Channel)