టీమ్ ఇండియా తరపున ఆడిన ఎంతో మంది క్రికెటర్లు తమ కెరీర్ బిజీలో పడి చదువును అటకెక్కించడం మనకు తెలుసు. సచిన్ టెండుల్కర్ 10 వ తరగతితోనే ఆపేయగా.. ఎంఎస్ ధోనీ కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు. అయితే ఒక ఐదుగురు క్రికెటర్లు మాత్రం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రతిష్టాత్మకమైన కళాశాలలో వీళ్లు ఇంజనీరింగ్ చేయడం విశేషం.
1. అనిల్ కుంబ్లే
టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో ఇండియా తరపున అత్యధిక వికెట్లు (619) తీసి రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 337 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. కుంబ్లే బెంగళూరులోని విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బీఈ పట్టా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన సమయంలోనే 1991-92లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాడు.
3. ఎరాపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న
టీమ్ ఇండియా తరపున 1962 నుంచి 1978 వరకు క్రికెట్ ఆడిన ఎరాపల్లి ప్రసన్న.. ఒక స్నిన్నర్. ఆయన 49 టెస్టుల్లో 189 వికెట్లు తీసుకున్నాడు. ఆయన మైసూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ పూర్తి చేశాడు. 1961-62 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టిన ప్రసన్న.. ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ఐదేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. బీఈ పూర్తి అయ్యాక 1967లో తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
5. రవిచంద్రన్ అశ్విన్
టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగేళ్ల తర్వాత తిరిగి వైట్ బాల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టెస్టుల్లో కీలక స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్ 2017 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేశాడు. అనంతరం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో కూడా పని చేశాడు.