మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాళ్లు. ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారిదేనైనా ఈ ఇద్దరూ టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించారు. కెప్టెన్‌గానూ తిరుగులేని రికార్డులు రోహిత్-విరాట్ సొంతం. అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది మీడియాలో చాలా కాలం ప్రచారం సాగింది. ఈ ప్రచారం నిజమేనని తెలుస్తోంది. Image source AFP
ఇద్దరి మధ్య 2019 వరల్డ్ కప్ తర్వాత విభేదాలు ఏర్పడినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని.. సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు కూడా. అయితే శాస్త్రి జోక్యం చేసుకోవడంతో కోహ్లీ, రోహిత్ మళ్లీ ఫ్రెండ్స్‌గా మారిపోయినట్లు శ్రీధర్ చెబుతున్నారు. Image source AP
2019 వరల్డ్ కప్ ముగిసిన 10 రోజుల తర్వాత వెస్టిండీస్ టీ20 సిరీస్ కోసం అమెరికా చేరుకున్నామని... అప్పుడు విరాట్, రోహిత్‌ను తన గదికి పిలిపించి రవిశాస్త్రి మాట్లాడినట్లు శ్రీధర్ చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని.. అలా ఉండాలంటే మీ ఇద్దరూ ఒకే తాటిపై ఉండాల్సిన అవసరం ఉందని నచ్చజెప్పడాట రవిశాస్త్రి. Image source rediff
కోహ్లీ, రోహిత్ మధ్య ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉందని శ్రీధర్ చెప్పారు. ఫామ్‌లో లేక ఇబ్బదులు పడుతున్న సమయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం.. ఆస్ట్రేలియాపై భారత్ విజయాన్ని ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం.. పాకిస్థాన్‌పై కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ కింగ్‌ను ఎత్తుకోవడం లాంటివి వాళ్ల బంధాన్ని చూపిస్తున్నాయన్నారు శ్రీధర్. Image source Outlook