* WIPL ఫ్రాంచైజీలపై ప్రస్తుత IPL ఫ్రాంచైజీల ఆసక్తి : ఇప్పటికే ఉన్న 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యం కోసం ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 ఫ్రాంచైజీలు కాకుండా మరో 20 కంపెనీలకు టెండర్ డాక్యుమెంట్లు జారీ అయ్యాయి. కంపెనీలు బిడ్లను సమర్పించడానికి జనవరి 23 చివరి గడువు. జనవరి 25న జట్లను ప్రకటించనున్నారు.
* స్టేడియాలకు పోటెత్తుతున్న జనాలు : భారతదేశంలో ఎక్కువ మంది క్రికెట్‌ను ఆరాధిస్తారు. క్రమంగా ఉమెన్ క్రికెట్‌కి కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. గత నెలలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు విశేష స్పందన లభించింది. ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ రెండు స్టేడియంలలో నిర్వహించారు. మన జట్టుకు సపోర్ట్ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. సిరీస్‌లోని రెండో T20I వీక్షించడానికి 25,000 మంది అభిమానులతో DY పాటిల్ స్టేడియం కిక్కిరిసిపోయింది.