తారక్ సిన్హా మరణంపై సొన్నెట్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘సొన్నెట్ క్లబ్ని స్థాపించిన శ్రీ తారక సిన్హాగారు మన మధ్య లేరనే విషయాన్ని తెలియచేయడానికి చింతిస్తున్నాం. రెండు నెలలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన, శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు... ’ అంటూ తెలిపింది సొన్నెట్ క్లబ్.