Home » photogallery » sports »

TENNIS STAR SANIA MIRZA WITH BOLLYWOOD STAR PARINEETI CHOPRA PICS GOES VIRAL SR

బాలీవుడ్ తారలతో సానియా మీర్జా..వైరల్ అవుతోన్న ఫోటోస్

క్రీడాకారిణి సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆట, అందంతో భారతదేశంలోనే కాకుండా..ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు సానియా..తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర స‌ృష్టించింది. ఇంతటి ఘనత సాధించిన సానియాపై ఓ సినిమా రానున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సానియా పాత్ర కోసం బాలీవుడ్ తార పరిణీతి చోప్రాను ఎంచుకున్నట్లు సమాచారం.