TENNIS STAR SANIA MIRZA SPOTTED WITH SUPERSTAR MAHESH BABU AND HIS FAMILY IN NEW YEAR PARTY
సానియాను హత్తుకున్న సూపర్‌స్టార్ మహేష్... వీరి ఫ్రెండ్షిప్ చూసి ఫ్యాన్స్ షాక్...
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి సందడి చేశాడు. అదేంటి... ఇద్దరూ రెండు భిన్నధృవాలు. అలాంటిది మహేష్ బాబుకీ, సానియాకీ ఎలా స్నేహం కుదిరిందని ఆశ్చర్యపోతున్నారు. భారత టెన్నిస్ స్టార్ సానియా ఈ మధ్యే ఓ బిడ్డకు తల్లి అయిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫ్యామిలీలోకి కొడుకు ఇజాన్ రాకతో సంతోషాల సంబరాల్లో మునిగిపోయింది. దుబాయ్‌లో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో ఈ జంటతో జతకలిసారు మహేష్ అండ్ నమ్రతా జోడి...
సానియా మీర్జాతో మహేష్ ఆత్మీయ ఆలింగనం ఫోటో... అటు సినీ అభిమానులను, ఇటు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
2/ 27
ఈ స్టార్స్ మధ్య ఇంత సాన్నిహిత్యం ఉండడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
3/ 27
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒకే ఫోటోలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
4/ 27
దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో నమ్రతా శిరోద్కర్, మహేష్ అండ్ బ్యాచ్‌తో కలిసి ఎంజాయ్ చేశారు సానియా మీర్జా అండ్ షోయబ్ మాలిక్..
5/ 27
రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ మంచి స్నేహితులు. అలాగే ఉపాసన, సానియా మీర్జా కూడా మంచి స్నేహితులు. ఆ పరిచయమే వీరిని ఒక్కటి చేసింది.
6/ 27
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఉపాసన, రామ్‌చరణ్, మహేష్, నమ్రత శిరోద్కర్ కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే.
7/ 27
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహాన్లతో సానియా మీర్జా (photo: instagram/mirzasaniar)
8/ 27
ప్రసవం తర్వాత బరువు తగ్గి, టెన్నిస్ బ్యాట్ పట్టుకునేందుకు తెగ కష్టపడుతున్న భారత టెన్నిస్ స్టార్... (instagram/mirzasaniar)
9/ 27
జిమ్‌లో కసరత్తులు చేసిన సానియా మీర్జా ఫోటోలు వైరల్...
10/ 27
సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌ల కొడుకు ఇజాన్.ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోనూ సానియా మీర్జా పోస్ట్ చేసింది. ( Sania Mirza / Twitter )
11/ 27
భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా కొత్త ఏడాదిలో తనకు ఎలా ఉండాలనుందో న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంది. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసింది. "ఈ కొత్త సంవత్సరంలో పాపలా కాదు...తన భర్త షోయబ్ మాలిక్‌లా నిద్ర పోవాలని ఉంది.." అని ట్వీట్ చేసింది. ( Sania Mirza / Instagram )
12/ 27
2018లో తనకు దక్కిన అపూర్వమైన కానుక తన కొడుకు ఇజాన్ అని పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. డిసెంబర్ 22న తొలిసారిగా ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోను సానియా మీర్జా పోస్ట్ చేసింది. ( Sania Mirza / Twitter )
13/ 27
కొత్త ఏడాదిలో ఇజాన్ ఆలనా,పాలనా చూసే బాధ్యత లేకుండా తనకు భర్త షోయబ్ మాలిక్‌లా ప్రశాంతంగా నిద్రపోయె అవకాశముంటే బాగుండేది అని సానియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ( Sania Mirza / Instagram )
14/ 27
కొడుకుతో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా. 2018,అక్టోబర్ 30న సానియా ఇజాన్‌కు జన్మనిచ్చింది. ( Sania Mirza / Twitter )
15/ 27
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోను గంటలోనే రెండు లక్షలమంది లైక్ చేశారు. ( Sania Mirza / Twitter )
16/ 27
2018లో టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా మీర్జా...2019లో రీ ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తిరిగి టెన్నిస్ కోర్ట్‌లో బరిలోకి దిగాలని ప్లాన్‌లో ఉంది. ( Sania Mirza / Instagram )
17/ 27
ఇజాన్‌తో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా. ( Sania Mirza / Twitter )