Sania Mirza : సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా, అందంతో... ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.