TENNIS STAR SANIA MIRZA AND RAKUL PREET SINGH FIRES UP THE RAMP FOR CHARITY FASHION SHOW ALONG WITH BOLLYWOOD STAR HUMA QURESHI CR
ఫ్యాషన్ షోలో అదరగొట్టిన సానియా మీర్జా... టెన్నిస్ స్టార్ క్రేజ్‌కు రకుల్ ప్రీత్ షాక్...
సానియా మీర్జా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటతీరుతో ఎంత ఆకట్టుకుందో, అందాల ప్రదర్శనలోనూ అభిమానులు, ఫ్యాషన్ ప్రియులను అంతే అలరించింది సానియా. టెన్నిస్ రాకెట్ పట్టుకుని ప్రత్యర్థిపై షాట్లతో విరుచుకుపడినా... ఫ్యాషన్ దుస్తుల్లో ర్యాంపు స్టేజ్‌ను షేక్ చేసినా అది సానియాకే చెల్లింది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా సానియా అందం ఇసుమంతైనా తగ్గలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భారీ వర్కవుట్స్ చేసి, మళ్లీ ఫిట్‌గా మారిన సానియా మీర్జా తాజాగా ఓ ర్యాంపు వాక్‌లో తళుక్కున మెరిసింది. సానియా మీర్జాతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ వంటి వాళ్లు కూడా ఈ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసినా... సానియానే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
‘టీచ్ ఫర్ ఛేంజ్’ (మార్పు కోసం బోధన) పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సినిమా స్టార్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేసింది సానియా మీర్జా (Image: Viral Bhayani)
2/ 12
రజినీకాంత్ సరసన ‘కాలా’ సినిమాలో హీరోయిన్గా నటించిన హుమా ఖురేషీ కూడా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంది. (Image: Viral Bhayani)
3/ 12
నాగచైతన్య ‘సవ్యసాచి’, అఖిల్ ‘మజ్ను’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ర్యాంపుపై తళుక్కున మెరిసింది. (Image: Viral Bhayani)
అయితే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోష్ ముందు రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన నిలవలేకపోయింది. (Image: Viral Bhayani)
7/ 12
ర్యాంపుపై అందంగా నడిచిన సానియా మీర్జా... హుషారుగా నవ్వేసి, అందరి మనసుల్ని దోచేసింది (Image: Viral Bhayani)
8/ 12
వైట్ అండ్ బ్లూ కలర్ లెహాంగాలో మెరిసిన సానియా మీర్జా ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ఫ్యాషన్ షోకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (Image: Viral Bhayani)
9/ 12
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ముద్దుగా, కాస్త బొద్దుగా తయారైన సానియా మీర్జా... గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.. (Image: Viral Bhayani)
10/ 12
‘తూనీగ తూనీగ’ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి కూడా హైదరాబాద్ ఫ్యాషన్ షోలో అందాలను ఆరబోసి, కుర్రకారును ఫిదా చేసింది. (Image: Viral Bhayani)
11/ 12
టెన్నిస్ స్టార్ క్రేజ్ కారణంగా ఫ్యాషన్ షోలో పాల్గొన్న ముగ్గురు హీరోయిన్లు వెలవెలబోయారు. (Image: Viral Bhayani)
12/ 12
సినీ నటుడు, మోడల్ హర్షవర్థన్ రానే కూడా ఈ ఫ్యాషన్ షోలో ర్యాంప్పూ బ్లాక్ డ్రెస్‌లో మెరిసాడు. (Image: Viral Bhayani)