టీమిండియా శ్రీలంక పర్యటన వాయిదా పడింది. కరోనా కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక బోర్డు తెలిపింది. శ్రీలంక టూర్లో భాగంగా కోహ్లీ సేన మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ సాధ్యం కాదని శ్రీలంక బోర్డు అధికారులు చెప్పారు. (Image: Twitter) అయితే, క్రికెట్ మ్యాచ్లు ప్రారంభించే ముందు తమ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని బీసీసీఐ చెప్పినట్టు లంక బోర్డు తెలిపింది.(Image: Twitter) శ్రీలంకలో ఇప్పటి వరకు 1873 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. చివరిసారి భారత జట్టు 2017లో శ్రీలంకలో పర్యటించింది. మూడు టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడింది. అన్నీ క్లీన్ స్వీప్ చేసింది.