Team India : టీమిండియా ఇజ్జత్ కాపాడిన డేర్ డెవిల్.. అతడే లేకపోయి ఉంటే బంగ్లాదేశ్ చేతిలో చావు దెబ్బ తినేవాళ్లం
Team India : టీమిండియా ఇజ్జత్ కాపాడిన డేర్ డెవిల్.. అతడే లేకపోయి ఉంటే బంగ్లాదేశ్ చేతిలో చావు దెబ్బ తినేవాళ్లం
Team India : బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ విఫలం అయితే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అజేయమైన 8వ వికెట్ కు 71 పరుగులు జోడించి భారత్ ను గెలిపించారు.
బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో టీమిండియా (Team India) త్రుటిలో ఓటమిని తప్పించుకుంది. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో మాత్రం పోరాడాల్సి వచ్చింది.
2/ 7
బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ విఫలం అయితే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అజేయమైన 8వ వికెట్ కు 71 పరుగులు జోడించి భారత్ ను గెలిపించారు.
3/ 7
ఈ టెస్టు సిరీస్ లో భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచింది శ్రేయస్ అయ్యర్. తొలి టెస్టులో 86 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
4/ 7
ఇక రెండో టెస్టులోనూ శ్రేయస్ ఒక్కడే నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో పంత్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
5/ 7
ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 29 పరుగులతో అజేయంగా నిలిచి టీంను గెలిపించాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్లు దూకుడు మీదున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ అటాకింగ్ ఆటతో టీమిండియాకు ఊపిరి పోశాడు.
6/ 7
షకీబుల్ హసన్.. మెదీ హసన్ వికెట్లు తీస్తున్న వేళ శ్రేయస్ అయ్యర్ కౌంటర్ అటాక్ కు దిగి బంగ్లాదేశ్ బౌలింగ్ ను చెల్లా చెదురు చేశాడు. షకీబుల్ వేసిన ఓవర్ లో రెండు ఫోర్లు బాది జట్టును గెలుపు ట్రాక్ లో నిలిపాడు.
7/ 7
ఈ సిరీస్ లో 202 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. సిరీస్ ను భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓడకుండా తన వీరోచిత పోరాటంతో టీమిండియా ఇజ్జత్ ను కాపాడాడు.