ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లీగ్ స్టేజ్ ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సాగిన 2022 ఐపీఎల్ సీజన్ లో చాంపియన్ జట్లు అయిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు దారుణంగా నిరాశ పరిస్తే.. కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) జట్లు అంచనాలను తలకిందులు చేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. (IPL Twitter)
ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆర్సీబీ 8 మ్యాచ్ లు గెలిస్తే అందులో సగం మ్యాచ్ లు దినేశ్ కార్తీక్ పుణ్యమా అనే గెలిచిందన్నది వాస్తవం. భారత స్టార్ లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లు పరుగులు సాధించేందుకు తంటాలు పడితే.. దినేశ్ కార్తీక్ మాత్రం ఆఖర్లో వచ్చి దాదాపు 200 స్ట్రయిక్ రేట్ తో పరుగుల సాధించి అదరగొట్టాడు.