గ్రౌండ్ లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోవాల్సిన మన కుర్ర బ్యాట్స్ మెన్ గుండెల్లో ప్రేమ అలజడి మొదలైంది. ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. ప్రేమ వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. ఈ ప్రేమ పక్షుల ఫోటోలను చూసేయండి. (Photo Credit : INSTAGRAM)
రిషభ్ పంత్-ఇషా నేగి : ఇంటీరియర్ డిజైనర్ ఇషా నేగితో మంచుకొండల్లో దిగిన ఫొటోలను న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసిన పంత్..‘నీతో ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అని రాయడం ద్వారా ఆమెతో తన ప్రేమను వ్యక్తపరిచాడు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయ్. (Photo Credit : INSTAGRAM)
శుభ్‌మన్ గిల్ - సారా టెండూల్కర్ : గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుకు కళాత్మకత జోడించి 91 పరుగులు చేసిన పంజాబ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఇక లెజెండరీ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్లో ఉన్నాడన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గత ఐపీఎల్లో కోల్‌కతా ఆటగాడైన గిల్ ఫీల్డింగ్ విన్యాసాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి దానికో లవ్ సింబల్‌ను కూడా సారా ఇవ్వడంతో వారి డేటింగ్ వార్తకు బలం చేకూర్చింది. (Photo Credit : INSTAGRAM)
ఇషాన్ కిషన్ - అదితి హుండియా : గత ఐపీఎల్‌ఎలో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్ ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాటిలో కొన్ని ఫొటోలను ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్, మిస్ యూనివర్స్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అదితి హుండియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందన్న వార్తలు బయలుదేరాయి. (Photo Credit : INSTAGRAM)