TEAM INDIA WOMEN REACHED AUSTRALIA TEAM WILL BE IN HARD QUARANTINE FOR 14 DAYS JNK
Team India Women: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు.. బ్రిస్బేన్‌లో హార్డ్ క్వారంటైన్
భారత మహిళా క్రికెట్ జట్టు బెంగళూరు నుంచి దుబాయ్ మీదుగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చేరుకున్నది. ఆసీస్ పర్యటన ప్రారంభానికి ముందు భారత జట్టు 14 రోజుల హార్డ్ క్వారంటైన్లో ఉండనున్నది.
భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఆసీస్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో బ్రిస్బేన్‌లో జట్టును హార్డ్ క్వారంటైన్లో ఉంచనున్నారు.
2/ 10
భారత మహిళా క్రికెట్ జట్టు ఆదివారం ఆస్ట్రేలియా బయలు దేరి వెళ్లింది. అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భారత జట్టు 14 రోజుల హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు.
3/ 10
బ్రిస్బేన్ చేరుకున్న తర్వాత కేవలం 7 రోజుల క్వారంటైన్ తర్వాత మహిళా జట్టు ట్రైనింగ్ మొదలు పెడుతుందని బీసీసీఐ చెప్పింది. కానీ ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో క్వారంటైన్‌ను 14 రోజులకు పెంచారు.
4/ 10
'ప్రస్తుత పరిస్థితుల్లో 7 రోజుల తర్వాత ట్రైనింగ్ ప్రారంభించడం కష్టమే. భారత జట్టు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హార్డ్ క్వారంటైన్లో ఉండటం కష్టమే అయినా.. తప్పని పరిస్థితి' అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
5/ 10
బ్రిస్బేన్‌లో క్వారంటైన్ తర్వాత సిడ్నీతో పాటు మెల్బోర్న్, పెర్త్ నగరాల్లో మ్యాచ్‌లు ఆడటానికి ప్రయాణించాల్సి ఉన్నది. అయితే వేదికల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.
6/ 10
పర్యటనలో మార్పులను క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలోనే ప్రకటించనున్నది. క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడనున్నది.
7/ 10
భారత జట్టు ఈ పర్యటనలో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లతో సహా ఒక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది.
8/ 10
22 సభ్యులున్న భారత జట్టు దుబాయ్ మీదుగా సోమవారం బ్రిన్బేన్లో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భారత జట్టు తొలి సారిగా పింక్ బాల్ టెస్ట్ ఆడనున్నది.
9/ 10
భారత జట్టు పింక్ బాల్ టెస్టు ఆడనున్నా... ట్రైనింగ్ సెషన్లో మాత్రం ఎక్కువగా తెల్లని బంతులతోనే ప్రాక్టీస్ చేసే అవకాశం ఉన్నది.