Smriti Mandhana : ఆ రికార్డు విరాట్ కోహ్లీ వల్లే కాలేదు..కానీ, స్మృతి మంధాన కొట్టేసింది..

Smriti Mandhana : దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఫస్ట్ వన్డేలో ఓడిపోయిన టీమిండియా దెబ్బకు దెబ్బకి తీసింది. రెండో వన్డేలో సూపర్ విక్టరీ కొట్టి టీమిండియా బోణి కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మిథాలీ రాజ్ సేన. అయితే, ఈ మ్యాచ్ లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత అందుకొంది.