బుమ్రా, సంజనాలు ఈ ఏడాది మార్చి 15వ తేదీన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి కోసం బుమ్రా.. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. (photo credit : Instagram)
అంతేకాదు ఓ లవింగ్ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. " ప్రతి రోజు నా హృదయాన్ని దోచుకునే నా ప్రాణమా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా దానివి. ఐ లవ్ యూ " అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. సంజన ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అందరూ సంజనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.