క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) మొదలైంది. ఇక, అక్టోబర్ 24వ తేదీ నుంచి టీమిండియా తమ టీ20 ప్రపంచకప్ జర్నీ స్టార్ట్ చేయనుంది. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇదే మ్యాచుతో భారత్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది.