ఐర్లాండ్ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసింది. హ్యారీ హెక్టార్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో భారత్ 9.2 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 111 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ గా వచ్చిన దీపక్ హుడా (29 బంతుల్లో 47; 6 ఫోర్లు నాటౌట్, 2 సిక్సర్లు) జట్టుకు విజయాన్ని అందించాడు.