వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో కన్పించినందుకు మరికొంత మొత్తం లభిస్తుంది. క్రికెటర్గా వచ్చే ఈ రాబడి కాకుండా.. మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో "ఎస్.ఎం.18" అని ఆమె ఒక కేఫ్ నడుపుతున్నారు. స్మృతి తలపైకి లాభాల గంపను ఎత్తుతున్న ఆమె తొలి వెంచర్ అది. ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది.