అధిక బరువు ఉండే ఆడవాళ్లు ఎదుర్కునే సమస్యల గురించి సున్నితంగా ప్రస్తావిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్రమ్ రమణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జహీర్ ఇక్బాల్, మహత్ రాఘవేంద్ర వంటి స్టార్స్ కూడా ఉన్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న విడుదల కానున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. రాజశ్రీ త్రివేది (ఖురేషి), సైరా ఖన్నా (సోనాక్షి) లు ఈ పాత్రల కోసం బరువు పెరిగి మరీ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.