సాధారణంగా టీమ్ కు సంబంధించి ఏ కీలక నిర్ణయమైనా టీమిండియా కెప్టెన్ ను సంప్రదించాల్సి ఉంటుంది. చాలా వరకు తుది నిర్ణయం టీమిండియా కెప్టెన్ దే అవుతోంది. జట్టు ఎంపికలో గానీ, మేనేజ్ మెంట్ విషయంలో గానీ, కోచింగ్ స్టాఫ్ ఇలా ఏ మ్యాటర్ అయినా సరే టీమిండియా కెప్టెన్ దే అంతిమ నిర్ణయం. కానీ, విరాట్ కోహ్లీ దూకుడు తగ్గించడానికి బీసీసీఐ ప్రయత్నాలు మొదలయ్యాయ్ అనడానికి లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టుగా విరాట్ కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అయితే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేయడంలో కూడా బీసీసీఐ పెద్దల నిర్ణయమే ఫైనల్ అవుతోందని స్పష్టం అవుతోంది.