ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్‌ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి ఆసియా సెలబ్రెటీగా విరాట్ గుర్తింపు పొందాడు. అంతేకాక తొలి భారతీయుడిగా, తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన భారత క్రీడాకారుల లిస్ట్ లో తొలి స్థానంలో కోహ్లీ నిలిచాడు. తొలి ఆసియా సెలబ్రెటీగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఏ క్రికెటర్ కూడా ఇంత ఫాలోయింగ్ లేదు.
50 మిలియన్ మార్క్‌ను కూడా ఎవరూ అందుకోలేదు. క్రికెట్ ఆటను శాసిస్తున్న టాప్ జట్ల ఆటగాళ్లు సైతం 50 మిలియన్ మార్క్‌ను చేరుకోలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, కివీస్ సారథి కేన్ విలియంసన్ లాంటి వారు కూడా 50 మిలియన్ మార్క్‌ను అందుకోలేకపోయారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుతం రొనాల్డో ఖాతాను అసురించేవారి సంఖ్య 337 మిలియన్లుగా ఉంది. మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ స్టార్ ది రాక్‌కు 266 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 260 మిలియన్లు, నెయ్మర్ జూనియర్ 160 మిలియన్ల ఫాలోవర్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ నెయ్‌మర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.