Team India : అందరికి ఏమో కానీ.. ఆ ఇద్దరు ప్లేయర్లకు మాత్రం బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కాళరాత్రే..
Team India : అందరికి ఏమో కానీ.. ఆ ఇద్దరు ప్లేయర్లకు మాత్రం బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కాళరాత్రే..
Team India : వన్డే సిరీస్ లో భారత్ ను ఓడించడంతో టెస్టు సిరీస్ కూడా హోరాహోరీగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే టెస్టు ఫార్మాట్ లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి టెస్టులో 188 పరుగుల భారీ తేడాతో భారత్ నెగ్గింది.
బంగ్లాదేశ్ (Bangladesh) పర్యటనను టీమిండియా (Team India) మిశ్రమ ఫలితాలతో ముగించింది. తొలుత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో కోల్పోయిన టీమిండియా అందరినీ ఆశ్చర్యపరిచింది.
2/ 8
వన్డే సిరీస్ లో భారత్ ను ఓడించడంతో టెస్టు సిరీస్ కూడా హోరాహోరీగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే టెస్టు ఫార్మాట్ లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి టెస్టులో 188 పరుగుల భారీ తేడాతో భారత్ నెగ్గింది.
3/ 8
అయితే రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా మూడు, నాలుగు రోజుల్లో బంగ్లాదేశ్ జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ ల వీరోచిత పోరాటంతో భారత్ పెను పరాభావాన్ని త్రుటిలో తప్పించుకుంది.
4/ 8
ఇక టెస్టు సిరీస్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్ల ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. ఇందులో ఒకరు ఈ సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అయితే మరొకరు విరాట్ కోహ్లీ.
5/ 8
కేఎల్ రాహుల్ రెండు టెస్టుల్లోనూ కలిపి 57 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో వరుసగా 22, 23 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులో దారుణ ప్రదర్శన చేవాడు. తొలి ఇన్నింగ్స్ లో 10.. రెండో ఇన్నింగ్స్ లో 2 పరుగులు మాత్రమే చేశాడు.
6/ 8
ఇక విరాట్ కోహ్లీ రెండు టెస్టుల్లోనూ కలిపి 45 పరుగులు చేశాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
7/ 8
ఇక రెండో టెస్టులోనూ పూర్ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగులు చేసి.. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో జట్టుకు అవసరం అయిన చోట అతి జాగ్రత్తకు పోయి వికెట్ ను పారేసుకున్నాడు.
8/ 8
అటు రాహుల్.. ఇటు కోహ్లీ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో మురిపించలేకపోయారు. ముఖ్యంగా రాహుల్ పై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. రాహుల్ వన్డే సిరీస్ లో తొలి వన్డేలో మినహా మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు.