SuryaKumar Yadav : అరుదైన రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయిన సూర్యకుమర్.. వచ్చే ఏడాది సాధిస్తాడా?
SuryaKumar Yadav : అరుదైన రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయిన సూర్యకుమర్.. వచ్చే ఏడాది సాధిస్తాడా?
SuryaKumar Yadav : ఇతర ప్లేయర్లు పరుగుల కోసం కష్టపడుతున్న పిచ్ లపై రెచ్చిపోయి ఆడటం సూర్యకు మాత్రమే సాధ్యం. ఫాస్ట్ బౌలింగ్ లోనూ స్వీప్ షాట్లు ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.
లేటు వయసులో టీమిండియా (Team India)లోకి అరంగేట్రం చేసిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ అదరగొడుతున్నాడు.
2/ 8
ఇతర ప్లేయర్లు పరుగుల కోసం కష్టపడుతున్న పిచ్ లపై రెచ్చిపోయి ఆడటం సూర్యకు మాత్రమే సాధ్యం. ఫాస్ట్ బౌలింగ్ లోనూ స్వీప్ షాట్లు ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.
3/ 8
అంతర్జాతీయ టి20ల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. 2022లో సూర్యకుమార్ యాదవ్ 31 ఇన్నింగ్స్ ల్లో 1,1164 పరుగుల చేశాడు. ఇందులో రెండు సెంచరీలు.. 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
4/ 8
ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అయితే ఓవరాల్ గా అంతర్జాతీయ టి20ల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచేందుకు కేవలం 165 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
5/ 8
ఒక ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. 2021లో అతడు 1,326 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు ఇవే.
6/ 8
సూర్యకుమార్ ఈ రికార్డుకు 165 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ ఏడాది భారత్ ఇకపై మరో టి20 సిరీస్ ఆడేది లేదు. న్యూజిలాండ్ తో సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ తో భారత్ వన్డే, టెస్టు సిరీస్ లను ఆడనుంది.
7/ 8
2022లో సూర్యకుమార్ యాదవ్ తర్వాత అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మొహమ్మద్ రిజ్వాన్ నిలిచాడు. అతడు 25 ఇన్నింగ్స్ ల్లో 996 పరుగుల చేశాడు.
8/ 8
బంగ్లాదేశ్ లో భారత్ పర్యటన డిసెంబర్ 4 నుంచి 26 వరకు జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే సిరీసే టీమిండియాకు ఈ ఏడాది ఆఖరి సిరీస్ కానుంది. సూర్యకుమార్ యాదవ్ రిజ్వాన్ రికార్డును బద్దలు కొట్టాలంటే కివీస్ పై రెచ్చిపోయి ఆడాల్సి ఉంది.