అలాంటి స్థితిలో ఫామ్ లోలేని పంత్ ను తుది జట్టులో ఆడించడం ఎంత వరకు సబబు అనేది క్రికెట్ అభిమానుల్లో తలెత్తుతున్న పెద్ద ప్రశ్న. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత కోచ్ మాట్లాడుతూ ’టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో పంత్ అంతర్భాగం. వేగంగా పరుగులు సాధించే క్రమంలో అతడు కొన్ని సార్లు అవుటయ్యాడు. దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు‘ అంటూ పంత్ ను వెనుకేసుకొచ్చాడు.
తాజాగా ముగిసిన సిరీస్ లో పంత్ వరుసగా.. 29, 5, 6, 17, 1 నాటౌట్ స్కోర్లతో మొత్తం 58 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ లో అతడు ప్రతిసారి కూడా చెత్త షాట్ కు ట్రై చేసి అవుటయ్యాడు. రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు తిరిగి జట్టులోకి వస్తే.. అప్పుడు జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకం.